భారత భూభాగాన్ని చైనా ఆక్రమించింది- సీఎం రేవంత్ 11 d ago
TG : సీఎం రేవంత్ కీలకవ్యాఖ్యలు చేశారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని అన్నారు. 2 వేల నుంచి 4 వేల కి.మీ వరకు ఆక్రమించిందని తెలిపారు. దీనిపై చర్చించేందుకు పాలకులకు ధైర్యం లేదని చెప్పారు. మణిపూర్‌లో జరుగుతున్న మారణకాండకు.. అక్కడ అధునాతన ఆయుధాలే కారణమని వెల్లడించారు. కార్పొరేట్ సంస్థలు ఖనిజ సంపదను దోచుకుంటున్నాయని విమర్శించారు. మణిపూర్‌లో శాంతి కోసం.. భారత బలగాలు అక్కడి ఆయుధాలను సీజ్ చేయలేవా అని మండిపడ్డారు. చైనా దురాక్రమణ, మణిపూర్ అంతర్యుద్ధంపై చర్చ జరగాలని.. అలాగే దేశంలో జరుగుతున్న అప్రకటిత యుద్ధంపై చర్చ జరిగితే దేశంలో శాంతి నెలకొంటుందని సీఎం రేవంత్ పేర్కొన్నారు.